నేడు నాగుల చవితి,విషనాగులు కూడా ప్రకృతిలో భాగమే

నేడు నాగుల చవితి,విషనాగులు కూడా ప్రకృతిలో భాగమే

నేడు నాగుల చవితి ప్రకృతి లో ప్రతి జీవి అవసరం

హిందూసంప్రదాయంలోనాగుల చవితికి విశిష్ట మై న స్థానం ఉంది. కార్తిక మాసంలోని శుక్ల పక్ష చవితిరోజుననాగదేవతను భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ఆనవాయితీ. వంశాచారాలను అనుసరించి నాగేంద్రునికి పూ జలునిర్వహించి,పాలు,చలిమి డి, వడపప్పు, నువ్వులతో చే సిన తీపి పదార్థాలనునైవేద్యం గా సమర్పిస్తారు. ఈ రోజున గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆరాధన కూడా విశేష ఫలప్రదమని భక్తుల విశ్వాసం.
నాగుల చవితి రోజున రైతులు వ్యవసాయ పనిముట్లను ఉప యోగించకుండా విశ్రాంతితీసు కుంటారు.ఇళ్లలోనూకూరగాయ లు కోయడానికి కత్తిపీట లు వంటిపనిముట్లనుఉపయో గించకూడదనే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ప్రకృతిలోని సమస్త జీవరాశుల పట్ల గౌర వం, అహింసా భావన ఈఆచా రాల వెనుకఅంతర్లీనంగాకనిపి స్తాయి.జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఆశ్లేష, ఆరుద్ర,మూల, పూర్వాభాద్ర, పూర్వాషాఢ నక్ష త్రాలనుసర్పసంబంధితనక్షత్రా లుగా పేర్కొంటారు. 'సర్పం' అంటేపాకుతూకదిలేది.'నాగం' అనే పదానికి నిరంతరం కదిలే ది, వేగంగా సాగిపోయేది అనే అర్థాలను సంప్రదాయవివరణ లు అందిస్తున్నాయి. కాలం కూడా నిరంతరం ముందుకు సాగుతుండటంతో నాగానికి కాలానికి ప్రతీక అనే భావనను ఆధ్యాత్మికంగా అన్వయిస్తారు. అందుకే కాలనాగం అనే పదప్ర యోగం కూడా ప్రాచుర్యంలో ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో కాల సర్ప దోషం గురించి ప్రస్తావన ఉంది. ఈ దోషం ఉన్నవారి జీవితంలో వివిధ అవరోధాలు ఎదురవుతాయని కొందరి విశ్వాసం. అయితే నాగారా ధన వెనుక ఉన్న ప్రధాన సందే శం ప్రకృతినిగౌరవించడం,జీవు ల పట్ల కరుణ కలిగి ఉండడం, దైవచింతనతోజీవించడం.'ఉరగము' అనే పదంకూడాసర్పాని కి పర్యాయపదంగా ఉపయోగి స్తారు. సర్పం తనశరీరాన్నినేల కు ఆనిస్తూపాకుతుంది.మనిషి జీవితం కూడా నిరంతరప్రయా ణమే. వివాహం, సంతానం వంటి ముఖ్యమైనజీవనఘట్టా లను సజావుగా సాగించాలనే ఆకాంక్షతో నాగదేవతను ఆరా ధిం చడం సంప్రదాయంగా వస్తోంది.శ్రీమహావిష్ణువుకుఆది శేషుడుశయ్యగా,పరమశివు నికి నాగాభరణంగా ఉండటం విశేషం. అందువల్ల నాగదేవత ను ఆరాధించడం ద్వారా హరి హరుల అనుగ్రహం లభిస్తుం దని భక్తులు విశ్వసిస్తారు. కార్తి క మాసమంతా నాగప్రతిమను పూజిస్తూ నాగస్తుతి చేయడం శుభప్రదమని భావిస్తారు. నెల రోజుల పాటు పూజ చేయలేని వారు కనీసం కార్తిక శుద్ధ చవి తి రోజునైనా నాగదేవతను భక్తితో ఆరాధించాలి.చవితి అంటే నాలుగో తిథి. భారతీ య తాత్విక సంప్రదా యంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాలను పే ర్కొన్నారు. వాటిలో నాలుగోది మోక్షం. నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధించడం ద్వారా కష్టాల నుంచి విముక్తి, ఆధ్యాత్మికఉన్నతి,దైవానుగ్రహం కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా దేవాలయాల్లో, ఇళ్లలో లేదా సంప్రదాయబద్ధంగా పుట్టల వద్ద నాగదేవతకు పూజలు నిర్వహిస్తారు.నాగులకు పాలు సమర్పించడంలోని అంత రార్థంనాగుల చవితి రోజున నాగదేవతకు పాలు సమర్పిం చడం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. పాలు స్వచ్ఛతకు ప్రతీక. పాలను వేడి చేసి చల్లార్చి, కొద్దిగా తో డు కలిపితే పెరుగు తయార వుతుంది. ఆ పెరుగును చిల కగా వెన్న లభిస్తుంది. వెన్నను కాచి నెయ్యిగా మారుస్తారు. ఆ నెయ్యినియజ్ఞయాగాదుల్లో హవిస్సుగా వినియోగిస్తారు.
ఈ ప్రక్రియను మానవ జీవితా నికి అన్వయిస్తే అద్భుతమైన తాత్వికభావనఆవిష్కృతమవుతుంది. మన జీవితం పాల వంటిది. జ్ఞానమనే వేడితో జీవి తాన్నిపరిపక్వంచేసుకుని,వివేక మనే తోడును కలిపితే సుఖ మనే పెరుగు ఏర్పడుతుంది. ఔదార్యమనే కవ్వంతో దానిని చిలికితే శాంతి అనే చల్లదనం లభిస్తుంది. సత్యం, శివం, సుం దరం అనే విలువలతో ఆలోచ నలను మథిస్తే సమాజసహకా రం అనే వెన్న లభిస్తుంది.ఆ వెన్నకు భగవదారాధన అనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జోడిస్తే త్యాగం, యోగం, భోగం అనే జీవనవిలువలుఆవిర్భవిస్తాయి. ఈ విధంగా పాలు స్వ చ్ఛత నుంచి పరిపూర్ణత వరకు సాగిన పరిణామానికి ప్రతీకగానిలుస్తాయి.జీవనానికి ప్రతీకగా భావించేనాగదేవతకు పాలను సమర్పించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఇదేనని పెద్దలు వివరిస్తారు. సకల వేదాల సారాన్ని, జీవన విలువలను ఈ ఆచారం మన కు గుర్తుచేస్తుంది.భక్తి భావమే ప్రధానం“దేవాః చక్షుషా పుం జానాః భక్తాన్ పాలయంతి” అనే సంప్రదాయ వాక్యం ప్రకారం దేవతలు భక్తులు సమర్పించే నైవేద్యాన్ని దృష్టి ద్వారానే స్వీకరిస్తారని భావి స్తారు. అంటే నైవేద్యంలో పరి మాణం కంటే భక్తి, శ్రద్ధ, పవిత్ర మైన మనసు ముఖ్యమైనవి.
అయితే పాములు సాధారణం గా పాలను తాగే జంతువులు కావు. పాలను తాగించడం వాటి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి నాగారాధన పేరుతో పాములకుబలవంతం గాపాలుతాగించకుండా,నాగప్ర తిమకు లేదా చిత్రపటానికి పాలను నైవేద్యంగా సమర్పిం చడం శ్రేయస్కరం. పుట్టల వద్ద పూజలు నిర్వహించేటప్పుడు అక్కడి జీవులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.నాగుల చవితి పండుగ మనకు భక్తితో పాటు ప్రకృతిపరిరక్షణ,జీవకారుణ్యం, ఆధ్యాత్మిక చింతన, సనాత న సంప్రదాయాల పట్ల గౌరవం వంటి విలువలను బోధిస్తుంది. నాగదేవతను ఆరాధిస్తూ సమ స్త జీవరాశులశ్రేయస్సును కోరుకోవడమే ఈ పర్వదినం అందించే గొప్ప సందేశం
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
9440408080.
Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments