దీపావళి కి ఏ నూనె శ్రేష్టం

దీపావళి కి ఏ నూనె శ్రేష్టం

దీపావ‌ళి దీపాల్లో ఏ నూ నె శుభ‌క‌రం?
లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
కామారెడ్డి నవంబర్ 7,(తెలంగాణ పత్రిక జిల్లా ప్రతినిధి)
జ్ఞానికి చిహ్నం గా,ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందా లకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు.దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలుసమృద్ధి గా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందనిశాస్త్రం చెబుతోంది.అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమం దు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు దీపా లు వెలిగిస్తారు. ఈ దీపంలో దేవతలున్నారు,వేదాలుఉన్నా యి, శాంతి ఉంది, కాంతి వుం ది. అయితే దీపాన్ని నేరుగా అగ్గి పుల్లతోవెలిగించకూడదు.
మరొక దీపం ద్వారా ప్రత్యేకం గా ముందుగా వెలిగించి పెట్టు కున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుంది లో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి.
మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూ డోదిఅన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవదిగౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు.
ఏ నూనెతో దీపారాధన చేయా ల‌న్నఅనుమానంఅంద‌రిలోనూ క‌లుగుతుంది.ఓపక్కఆవు నేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం.ఆవు నెయ్యిలో సూర్య శక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతో షాలు ప్రాప్తిస్తాయి.ఆవునెయ్యి లో నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.  వే ప నూనె రెండు చుక్కలు,ఆవు నెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంప త్యజీవితంసిద్ధిస్తుంది.విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది. నూవ్వు ల నూనె సకల దేవతలు ఇష్ట పడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. అయితే వేరుశెనగ నూనెను దీపారాధనకు వాడరాదు.

వైద్య.ఉమాశేషారావు

లెక్చరర్ ఇన్ సీవీక్స్

జి.జె సి దోమకొండ

.
Uploaded Image

0/Post a Comment/Comments