హితన్ని కోరి
రహస్యాలు లేని
భాషకు అందని
అపురూపం స్నేహితము
రక్తసంబందం అక్కరలేదు
కులమతలు అడ్డులేవు
అస్థిఅంతస్తుతలఊసే లేదు
మంచి మాట చాలు
ఖండాంతరాలు దాటి
స్నేహం చేయ వచ్చు
కుచెల కృష్ణుడు ల ఉండాలి
స్నేహం ముసుగులో మోసాలు
వద్దు
ఆనాడు కలం స్నేహం
నేడు ఫేస్ బుక్,ట్విట్టర్
ఇన్స్టాగ్రామ్ లలో మారె
అరె అని పీల్చుకుని
చిలిపిగా నవ్వుకొని
హాయిగా ఆయుష్షును పెంచుతూ
సజీవంగా పారే జీవనది
స్వా o తన చేకూర్చు
ఓదార్పు
మెరుపు
చేయూత
ఎదుగుద ల ను కోరుకునేదే
స్నేహం
ఉమాశేషారావు వైద్య