మీరు పంపిన వ్యాసాన్ని పత్రికల్ల జననీ జన్మభూమిశ్చస్వర్గాదపిగరీయసీ తల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని భావించినట్లే, మాతృభాషను కూ డా మనం అంతే పవిత్రంగా గౌరవించా లి. శిశువుకు తొలి గురువు తల్లి. శైశవం లో మొట్టమొదటిగా మాటలు నేర్పేది ఆ అమ్మే. అందుకే మాతచే నేర్పబడిన భాష ‘మాతృభాష’ అయింది. కానీ, నేటి ఆధునిక కాలంలో మన అమృతతు ల్యమైన తెలుగు భాష తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. అక్షరాభ్యాసం రోజేమో ఓంకారం లేదా శ్రీ లేదా అ ఆ లు పెట్టిస్తున్నాం ఆచరణలో మాత్రం ఆంగ్లానికేప్రాధాన్యతఇస్తున్నాముఒకనాడు ఐదేళ్ల వయసులో అక్షరాభ్యాసం చేయించి, 'పెదబాలశిక్ష'తో చదువు ప్రారంభించేవారు. ఆ పునాదితో రామా యణ, మహాభారతాలు, భాగవతాది పురాణాలు సలీసుగా చదవడమే కాకుండా కంఠస్థం చేసిన జ్ఞానులను, కవులను మనం చూశాం. కానీ నేడు మూడేళ్లకే పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారు. 'ట్వింకిల్ ట్వింకిల్', 'బా బా బ్లాక్ షీప్' వంటి ఆంగ్ల గేయాలు నేర్పించడంలో చూపుతున్న ఆసక్తి... వేమన, భాస్కర, దాశరథీ శతకాలలోని నీతి పద్యాలు నేర్పడంలో కనిపించడం లేదు. ఫలితంగా చిన్నతనం నుంచే పిల్లలకు భారతీయ సంస్కృతి, భక్తి, నైతిక విలువలు దూరమై, తెలుగు పద్యం పరాయిదైపోతోంది. తెలుగు మాట్లాడితే చిన్నచూపు మరియు ఆత్మ న్యనతా భాగంలో పిల్లలు తల్లిదండ్రులు చేరిపోతున్నారు వాస్తవంలో నేడు నేటి విద్యార్థులకు తెలుగు పూర్తిస్థాయిలో రావట్లేదు ఆంగ్లం పూర్తిస్థాయిలో రావటం లేదుప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికంటే కాన్వెంట్లలో చదివేవారు, ఆంగ్ల మాధ్యమంలో చదివేవారు తమను తాము అధికులుగా భావించుకోవడం నేడు పరిపాటిగా మారింది. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివే పిల్లల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ ఒక రకమైన ఆత్మన్యూనతా భావం పెరుగుతోంది. వేలు పోసైనా ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తేనే మంచి మార్కులు, రేంకులు వస్తాయనే నమ్మకం బలంగా పాతుకుపోయింది.కళాశాల స్థాయికి వచ్చేసరికి ప్రథమ భాషగా ఆంగ్లం చేరి, తెలుగు తన ప్రథమ స్థానాన్ని కోల్పోయింది. చివరకు ఎక్కువ మార్కుల కోసం మాతృభాషను పక్కన పెట్టి ఇతర భాషలను ఎంచుకునే పరిస్థితి దాపురించింది. సంతకం నుండి సంభాషణ వరకుఉద్యోగ, వ్యాపార పత్ర వ్యవహారాలు ఆంగ్లంలో ఉండటం అనివార్యమే కావచ్చు. కానీ, సాధారణ సందర్భాల్లో కూడా తెలుగులో సంతకం పెట్టడానికి వెనుకాడే పరిస్థితి వచ్చింది. తెలుగు వారితో కూడా ఆంగ్లంలో మాట్లాడటమే గొప్పగా, ఓ నాగరికతగా భావిస్తున్నారు. ప్రయాణాల్లో తెలుగు సాహిత్యం లభ్యం కానట్లు కేవలం ఆంగ్ల నవలలే చదవడం, ఆంగ్ల సినిమాలు చూసేవారే అధికులుగా భావించడం వంటి వైపరీత్యాలు సమాజంలో పెరిగిపోయాయి. సాయితేరంగంలోని కూడాఒకప్పుడు “కందం వ్రాసినవాడే కవి” అనే నానుడి ఉండేది. కానీ నేడు ఛందస్సు, యతి, ప్రాసలతో నిమిత్తం లేకుండా రాసే వచన కవితల హవా నడుస్తోంది. తీయనైన మన తెలుగు భాషలోని కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి నేటి తరానికి తెలియకపోవడం నిజంగా శోచనీయం. సొంత తల్లి గొప్పదనం తెలియని బిడ్డలాగే, తెలుగువారై ఉండి తెలుగు వైభవాన్ని మరచిపోవడం విచారక రం.తెలుగువారి నుండే మార్పు రావాలిఆంగ్లాన్ని ఒక భాషగా నేర్చుకో వడంలో తప్పులేదు, కానీ మాతృ భాషను విస్మరించడం శ్రేయస్కరం కాదు. రేపటి తరానికి కేవలం బతుకు తెరువు, ఆస్తులు మాత్రమే కాదు... భద్రతతో పాటు మన భారతీయతను, మాతృభాషను కూడా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ పరిస్థితి మారాలిమన మేటి తెలుగు మళ్లీ వెలుగులీనాలి.
వైద్య ఉమాశేషారావు
పౌరశాస్త్ర బోధకుడు
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దోమకొండ
9440408080