కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధైకాదశి’ ‘ఉత్థానైకాదశి’క్షీరాబ్ది ఏకాదశి’, బృందా వన ఏకాదశి’ అనే పేరుతో పిలుస్తారు.
ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడ లిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడనిపురాణకథనం.కార్తీకశుద్ధ ఏకాదశికే ‘భోధన ఏకాదశి, ‘దేవప్రబో ధిని ఏకాదశి’,‘ఉత్థాన ఏకాదశి’ అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనిం చిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబ ట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది.
దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభ మైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యా సం చేసి, అంపశయ్య మీద శయనించా డు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జ న్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువునుపూజించి,రాత్రిజాగరణచేయా లి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసిభోజనం చేసివ్రతాన్ని ముగించాలి.
పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజ సూయ యాగాల పుణ్యం లభిస్తుంది.
కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు, తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్య కార్యం చేసినా, అది సుమేరు పర్వతా నికి సమానమైన పుణ్య ఫలితం ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది.పుణ్య క్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మ దేవుడు నారద మహర్షితో అన్నారు.
ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటిమందికి అన్నదా నం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశిరోజునబ్రహ్మాదిదేవతలు,యక్షులు,కిన్నెరులు, కింపురుషులు, మహర్షు లు, సిద్దులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అం దువల్ల ‘ఉత్థాన ఏకాదశి’ రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారి కి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.
ఉమారాణి వైద్య
అంగన్వాడీ టీచర్
లింగాపూర్, కామారెడ్డి
9440408080